• Neti Charithra

ఆటోను ఢీ కొన్న లారీ.. నడి రోడ్డు పై.. ఇద్దరు మృతి.. అనంతపురం జిల్లా లో విషాదం..!


ఆటోను ఢీ కొన్న లారీ.. నడి రోడ్డు పై.. ఇద్దరు మృతి.. అనంతపురం జిల్లా లో విషాదం..!




అనంతపురం: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా లో ఆదివారం ఉదయం ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురంజిల్లాలోని బత్తలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ.. ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో

ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఇద్దరి మృతదేహాలు చిన్నాభిన్నం అయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మృతి చెందిన వారు తాడిమర్రి మండల కేంద్రానికి చెందిన భార్య భర్తలు సూర్య, ఆదెమ్మగా గుర్తించారు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


206 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon