• Neti Charithra

ఆటో ను ఢీకొన్న కంటైనర్.. ముగ్గురు మృతి.. మరో పది మంది ఆస్పత్రి పాలు..!


ఆటో ను ఢీకొన్న కంటైనర్.. ముగ్గురు మృతి.. మరో పది మంది ఆస్పత్రి పాలు..!అనంతపురం: నేటి చరిత్ర


అనంతపురంలోని రుద్రంపేట సమీపాన గురువారం ఆటోను కంటైనర్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మరణించగా.. 10 మంది గాయపడ్డారు. అనంతపురం రూరల్‌ మండలం

వడియంపేటకు చెందిన వ్యవసాయ కూలీలు ఆటోలో రాప్తాడు మండలం బుక్కచెర్లలో పనులు ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరారు. రుద్రంపేట బైపాస్‌ సమీపంలో కంటైనర్‌ అటోను

ఢీకొట్టింది. దీంతో స్వాతి (32), సులోచన (40), అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 10 మందిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీదేవి (42), మృతి చెందింది.