- Neti Charithra
ఆటో ను ఢీ కొన్న కంటైనర్.. ఇద్దరు మృతి...

#ఆటో ను ఢీ కొన్న కంటైనర్.. ఇద్దరు మృతి
గుంటూరు: నేటి చరిత్ర (సెప్టెంబర్13) ఆగివున్న కంటైనర్ను ఓ ఆటో ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరువద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూలీలు బతుకు తెరువు కోసం విజయవాడలో ఉంటున్నారు. వీరంతా విజయవాడ నుంచి గుంటూరులోని గొర్రెల మండికి ఆటోలో బయల్దేరారు. ఆత్మకూరు వద్దకు రాగానే రోడ్డుపక్కనే ఆగివున్న కంటైనర్ను వారు ప్రయాణిస్తున్న ఆటో వెనకనుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఇద్దరు వ్యక్తులు అక్కడి కక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరిని కోటిపల్లి శాంతారావు(38)గా గుర్తించారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రహదారి పక్కనే కంటైనర్ ఆగి ఉండటం ఆటో డ్రైవరు నిద్రమత్తులో గమనించక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని సీఐ శేషగిరిరావు, ఎస్సై ఎ.శ్రీనివాసరెడ్డి పరిశీలించి వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.