• Neti Charithra

ఆగివున్న లారీ ని ఢీకొన్న..కారు.. లోయలోకి దూసుకెళ్లి..ఏడుగురు మృతి. !


ఆగివున్న లారీ ని ఢీకొన్న..కారు.. లోయలోకి దూసుకెళ్లి..ఏడుగురు మృతి.

!




నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


బెంగుళూరు సమీపం లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఏడుగురు మృత్యువాత పడిన ఘటన విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు..

నగర శివార్లలోని అళంద రహదారిలోని సావళగి వద్ద నిలిపి ఉంచిన లారీని ఎదురుగా, వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దుర్ఘటన స్థలంలోనే కారులోని ఏడుగురూ దుర్మరణం చెందారు. అళందకు చెందిన వీరిని ఇన్ఫానా బేగం (25), రుబియా బేగం (50), అబేదాబీ బేగం (50), మునీర్‌ (28), మహ్మద్‌ ఆలీ (38), శౌకత్‌ ఆలీ (29),

జయచునబి (60)గా గుర్తించారు. గర్భిణిని ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు కారులో అళంద తాలూకా నుంచి కలబురగికి వస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని పొలాల్లో ఉన్న స్థానికులు పరుగున అక్కడకు చేరుకుని

సహాయ చర్యలు ఆరంభించారు. అప్పటికే కారులోని వారంతా మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకున్న తరువాత కారులోని శవాల్ని అతికష్టంతో వెలుపలికి తీశారు. కలబురగి సంచార పోలీసులు కేసు నమోదు చేశారు.