- Neti Charithra
ఆకాశం లోకి దూసుకెళ్లిన PSLV-C47.. !

#ఆకాశం లోకి దూసుకెళ్లిన రాకెట్.. !
నెల్లూరు: నేటి చరిత్ర (నవంబర్27) పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ల్యాంచ్ ప్యాడ్ నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. దేశ రక్షణ రంగం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహం కార్టోశాట్-3 సహా అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. కార్టోశాట్-3 ఉపగ్రహం దేశంలోకి చొరబడే ఉగ్రవాదులను పసిగట్టడంతోపాటు వారి కదలికలు, స్థావరాలపై ఓ కన్నేసి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారమందిస్తూ నిఘా నేత్రంలా పనిచేయనుంది. పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ ప్రయోగానికి సంబంధించి 26 గంటల కౌంట్‌డౌన్ మంగళవారం ఉదయం 7:28 గంటలకు ప్రారంభమైంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ ద్వారా కార్టోశాట్-3తోపాటు మరో 13 నానో ఉపగ్రహాలను 26.50 నిమిషాల్లోనే నిర్ణీత కక్ష్యల్లోకి చేరవేశారు.