- Neti Charithra
ఆకలి..అంటూ వచ్చిన వృద్ధు రాలి.. పై అఘాయిత్యం!

హైదరాబాదు: నేటి చరిత్ర (డిసెంబర్21)
తెలంగాణా లోఆకలితో అలమటిస్తున్న 60 ఏళ్ల యాచకురాలికి అన్నం పెడతామని ఇంట్లోకి పిలిచి.. ఆమెపై ఇద్దరు కామాంధులు అఘాయిత్యానికి పాల్పదిన దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి మల్కాజిగిరి సీఐ మన్మోహన్ కథనం మేరకు వివరాలిలు.. లాలాపేటకు చెందిన చిన్నప్ప అంథోని జార్జ్(50), వికారాబాద్ జిల్లా స్టేషన్ ధరూర్‌కి చెందిన నేనావత్ విజయ్ కుమార్‌లను భార్యలు వదిలేశారు. వీరిద్దరూ పెయింటింగ్ పనులు చేసుకుంటూ మీర్జాలగూడలో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఓ యాచకురాలు వీరి ఇంటి ముందుకు వచ్చింది. అన్నం పెడతానని జార్జ్ ఆమెను లోపలకు పిలిచాడు. ఇద్దరూ వృద్ధురాలిని కబుర్లలోకిదించారు. బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే 100 నంబరుకు ఫోన్‌చేసి పరిస్థితిని వివరించారు. నిందితులు అక్కడినుంచి పారిపోయారు. శనివారం నిందితులు మీర్జాలగూడలో సంచరిస్తుండగా వారిని అరెస్టు చేశారు