• Neti Charithra

అంబులెన్స్ వాహనం లో గంజాయి రవాణా.. చిత్తూరు పోలీసులకు పట్టు పడ్డ ముఠా..!


అంబులెన్స్ వాహనం లో గంజాయి రవాణా.. చిత్తూరు పోలీసులకు పట్టు పడ్డ ముఠా..!
చిత్తూరు: నేటి చరిత్రచిత్తూరు జిల్లా లో

అంబులెన్స్ ముసుగులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసి ఒక లక్ష రూపాయల విలువ చేసే 22కేజీల గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని ,తరలిస్తున్న నిందితులను,

అదుపులోకి తీసుకొని పోలీసులు అరెస్ట్ చేసిన, సంఘటన సోమవారం మండలం లో చోటుచేసుకుంది. ఈమేరకు సిఐ రామకృష్ణమాచారి,ఎస్ఐ సుధాకర్ రెడ్డి లు మాట్లాడుతూ.. విజయనగరం నుండీ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు ఆసుపత్రి అంబులెన్స్ లో ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు నటిస్తూ అందులో గంజాయిని తరలిస్తున్నట్లు

సమాచారం రావడంతో గండ్రాజుపల్లె వద్ద వాహనం ఆపి తనిఖీ చేసామన్నారు.అందులో గంగు నాయుడు, వరపుకుమార్,వినోద్,తేజ అను ముద్దాయిలను అరెస్టు చేసి పలమనేరు జెఎఫ్ సిఎమ్ కోర్ట్లో హాజరు పరిచామని అధికారులు తెలిపారు. ఇందులో తహసీల్దార్ బెన్నురాజు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.