- Neti Charithra
అంబులెన్స్ లో మద్యం అక్రమ రవాణా .. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు !

అంబులెన్స్ లో మద్యం అక్రమ రవాణా .. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు !
గుంటూరు: నేటి చరిత్ర
అత్యవసర రోగులను తరలించే అంబులెన్స్ లో తెలంగాణా నుంచి మద్యం తరలిస్తూ .. ఏపీ పోలీసులకు ముగ్గురు నిందితులు పట్టు పడ్డారు. ఈ సందర్భంగాతెలంగాణ నుంచి అక్రమంగా అంబులెన్స్‌లో తరలిస్తున్న 107 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. నందిగామ డీఎస్పీ రమణమూర్తి మంగళవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు ప్రైవేట్ అంబులెన్స్‌లో తెలంగాణ రాష్ట్రం మధిర

నుంచి మద్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్సైలు మురళీకృష్ణ, హరిప్రసాద్ సిబ్బందితో వెళ్లి వీరులపాడు మండలం పెద్దాపురం వద్దపట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్స్ కింద భాగంలో ఉన్న పెట్టెలోని సంచుల్లో మద్యం సీసాలను పెట్టినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరిపేటకు చెందిన గుంటు కోటేశ్వరరావు, వీరగంధం వినయ్‌కుమార్, కోతులూరి వెంకటశివలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కి పంపినట్లు ఎస్సై తెలిపారు.
