• Neti Charithra

అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఎమ్మార్పీఎస్ నిరసనలు..

# హైదరాబాదు: నేటి చరిత్ర ( సెప్టెంబర్8)

మాదిగలను కేబినెట్‌లోకి తీసుకోనందుకు నిరసనగా వారంపాటు అంబేద్కర్‌ విగ్రహాల ఎదుట నిరసన తెలుపుతామని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి 6 మంత్రి పదవులు, వెలమ సామాజిక వర్గానికి 5 మంత్రి పదవులు కట్టబెట్టిన కేసీఆర్‌ మాదిగలకు స్థానం కల్పించకుండా అన్యాయం చేశారన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు అవకాశం కల్పించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. తమ సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు దక్కనందుకు వారం రోజుల పాటు నిరసనలు తెలుపుతున్నట్లు మందకృష్ణ తెలిపారు.