• Neti Charithra

అంధత్వాన్ని రూపుమాపేందుకే వైఎస్సార్ కంటి వెలుగు- సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి!

#అంధత్వాన్ని రూపుమాపేందుకే వైఎస్సార్ కంటి వెలుగు- సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి!

మదనపల్లి: నేటి చరిత్ర (అక్టోబర్ 10 ) పిల్లలలో అందత్వాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వై.ఎస్.ఆర్.కంటి వెలుగు కార్యక్రమం ప్రవేశ పెట్టిందని సబ్ కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలనందు నిర్వహించిన ప్రపంచ దృష్టి దినోత్సవం సందరంగా రాష్ట్ర ప్రభుత్వం పరవేశ పెట్టిన డాక్టర్ వై.ఎస్.ఆర్. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. చాడువుకొనే పిల్లలకు ముఖ్యమైనది కంటి చూపు అని, కంటి చూపు బాగున్నపుడే వారు బాగా చదువుకోగలరని తెలిపారు. 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాటశాలలో చదువుతున్న ప్రతి స్కూల్ పిల్లలందరికీ కంటి పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. కంటి చూపు సంబంధించి సమస్యలు ఉంటే వారికి కంటి అద్దాలను అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు ఎం.నవాజ్ బాష మాట్లాడుతూ భారత దేశంలోనే ఏ రాష్ట్రంలో ప్రవేశ పెట్టనటువంటి పథకం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వై.ఎస్.ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని తెలిపారు. ప్రతి విద్యార్థినీ విద్యార్థులను కంటి పరీక్ష నిర్వహించే వారిలో దృష్టి లోపం ఉంటే దృష్టి లోపం నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం కొరకు అధిక ప్రాదాన్యత ఇస్తుందని అన్నారు. 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యం బాగుండాలనే సంకల్పంతో ఆరోగ్య శ్రీ 104,108 వైద్య సేవలను ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడుతున్నారని తెలిపారు. ప్రస్తుత సమయంలో పిల్లలు ఎక్కువ సోషల్ మీడీయా whatsapp, facebook ల పై శ్రద్ధ చూపుతున్నారని, వాటి వల్ల కంటి చూపు దెబ్బ తినడం తో పాటు సమయం వృదా అవుతుందని తెలిపారు. పిల్లలు బాగా చదువుకొని తల్లి తండ్రులుకు స్కూల్ కు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని పిల్లలకు సూచించారు. ఈ సమావేశంలో శిక్షణా కల్లెకర్ పృథ్వి తేజ్ మాట్లాడుతూ పిల్లలు కంటి జబ్బులు రాకుండా చూసుకోవాలనే టి.వి.లు, మొబైల్ ఫోన్ లను వాడడం తగ్గించి విటమిన్లతో కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని, అప్పుడే కంటికి సంబందించిన జబ్బులు నివారించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిప్యుటీ డి.ఎం.అండ్ హెచ్ ఓ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డాక్టర్ వై.ఎస్.ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా స్కూల్ పిల్లలందరికీ కంటి పరీక్షలు, కళ్ళ అద్దాలు కంటికి సంబందించిన వైద్య సేవలు ఉచితముగా అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో అందత్వం తగ్గించడం, శుక్లాలతో బాదపడుతున్న వారిని గుర్తించి ఐ.ఓ.ఎన్ ఆపరేషన్ ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. పిల్లలలో విటమిన్ ఏ.పోశక ఆహారం లోపం వల్ల వచ్చే అందత్వాన్ని గుర్తించి వారికి విటమిన్ ఏ తో కూడిన ఆహారం తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రదానోపాద్యాయులు రెడ్డెన్న శెట్టి మాట్లాడుతూ మా స్కూల్ నందు పిల్లకు ఈ కార్యక్రమం ఎంతో విలువైనది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జింకా చలపతి రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ సురేష్ బాబు, ఎం పి డి ఓ లీలా మాధవి, డాక్టర్లు శ్రీమతి అనుపమా, శ్రీమతి అనురాధ, వైద్య సిబ్బంది , ఆశా వర్కర్లు, ఉపాద్యాయులు, స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ రజియా సుల్తాన, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.