• Neti Charithra

అంతరాష్ట్ర ముఠా ను అరెస్ట్ చేసిన ముదివేడు పోలీసులు!

#అంతరాష్ట్ర ముఠా ను అరెస్ట్ చేసిన ముదివేడు పోలీసులు!

కురబలకోట: నేటి చరిత్ర( నవంబర్20) చిత్తూరు జిల్లా ముదివేడు పోలీస్ లు ఓ క్వారీ లో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసులో రూ. 54 లక్షల విలువైన యంత్రాలను సీజ్ చేసి నలుగురు అంతర్ రాష్ట్ర దొంగలను బుధవారం అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ సుప్రజ కథనం మేరకు ... కురబలకోట మండలం ముదివేడు సమీపం లోని జెమ్ క్వారీ లో ఈ నెల 2 వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు క్వారీ వద్ద ఉన్న సిబ్బంది పై దాడి చేసి ఖరీదు అయిన ఒక జనరేటెర్ తో పాటు రెండు కంప్రెషర్ లు దోచు కెళ్లారు. సీసీ పుటేజీల ఆధారం గా నిఘాపెట్టిన పోలీసులు ఈ కేసు ను ఛేదించేందుకు మదనపల్లె డిఎస్పి రవి మనోహర చారి, మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్,ముదివేడు,నిమ్మన పల్లె, తాలూక ఎస్ ఐ లు సుకుమార్, సహదేవి, దిలీప్ కుమార్ లను ఏర్పాటు చేశారు. కాగ మంగళవారం రాత్రి ఋషి వ్యాలీ ి మలుపు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం తో పలువురు ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ఈ విచారణ లో ముదివేడు సమీపం లో క్వారీ ల తో పాటు వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన రూ.54 లక్షల విలువైన యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముదివేడు తో పాటు జిల్లా లోని తంబల్లపల్లి, వెదురుకుప్పం, ఎస్ అర్ పురం, బై రెడ్డి పల్లి ప్రాంతాలతో పాటు అనంతపురం , ప్రకాశం జిల్లా మరియు తెలంగాణా లోని ఖమ్మం జిల్లా లోని పలు క్వారీ ల్లో ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు వెల్లడి అయ్యింది. ఈ కేసు లో నిందితులు మణికంఠ, శ్రీనివాసులు రెడ్డి, రాజు, పురుషోత్తం లను అరెస్టు చేసి బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఆమె తెలిపారు. సమావేశం లో మదనపల్లె డిఎస్పి రవిమనోహర చారి, సీఐ అశోక్ కుమార్, ఎస్ ఐ లు సుకుమార్, సహదేవి, దిలీప్ కుమార్ లు పాల్గొన్నారు.