• Neti Charithra

అంతరాష్ట్ర బస్సు సర్వీసుల రాక పోకలకు.. గ్రీన్ సిగ్నల్ !


అంతరాష్ట్ర బస్సు సర్వీసుల రాక పోకలకు.. గ్రీన్ సిగ్నల్ !



అమరావతి: నేటి చరిత్ర


మే 31వ తేదీ వరకూ లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అంతరాష్ట్ర బస్సు సర్వీసుల రాక పోకలకు ఏపీ తో పాటు పలు రాష్ట్రాల్లో గ్రీన్ సిగ్నల్ రానుంది.అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

మే 31 మెట్రో, విమాన సర్వీసులకు మినహాయింపు లేదు. కాలేజీలు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్, స్విమ్మింగ్ పూల్స్్, రెస్టారెంట్లు, హోటల్స్ పై నిషేధం కొనసాగుతుంది.

జన సమూహం ఎక్కువగా ఉన్న వాటికి మినహాయింపు లేదు. అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలనుకుంటే ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరాని చెప్పింది. అన్ని రాష్ట్రాలు ప్రజా రవాణాను పునరుద్ధరించుకోవచ్చు. రాజకీయ, సామాజిక సభలపై నిషేధం కొనసాగుతుంది. కంటెయిన్మెంట్ జోన్ లలో మాత్రం ఆంక్షలను కఠినంగా అమలు పర్చనున్నారు. రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకూ దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ అమలో ఉంటుందని పేర్కొంది. అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్