- Neti Charithra
అంతరాష్ట్ర బస్సుల రాకపోకలు కు పచ్చ జెండా..ఊపిన రాష్ట్ర ప్రభుత్వం !

అంతరాష్ట్ర బస్సుల రాకపోకలు కు పచ్చ జెండా..ఊపిన రాష్ట్ర ప్రభుత్వం !
హైదరాబాద్: నేటి చరిత్ర
అంతరాష్ట్ర బస్సు సర్వీసుల రాక పోకలకు తెలంగాణా సర్కార్ పచ్చ జెండా ఊపింది.
తెలంగాణలో కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత పరిస్థితులు జూన్ 7వరకు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర

ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆస్పత్రులు, ఔషధ దుకాణాలు మినహా ఇతర దుకాణాలు రాత్రి 8 గంటల వరకు

తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. కంటెయిన్మెంట్ జోన్లలో జూన్ నెలాఖరు వరకు లాక్డౌన్ యథాతథంగా అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, నిన్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ మూడు దశల కార్యాచరణను ప్రకటించిన సంగతి తెలిసిందే.
