• Neti Charithra

అంతరాష్ట్ర పర్యాటకులకు త్వరలో టూరిజం ప్యాకేజీలు- తిరుపతి డివిఎమ్ గిరిధర్ రెడ్డి..!


అంతరాష్ట్ర పర్యాటకులకు త్వరలో టూరిజం ప్యాకేజీలు- తిరుపతి డివిఎమ్ గిరిధర్ రెడ్డి..!



హార్సిలీహిల్స్: నేటి చరిత్ర


(తిరుపతి పర్యాటక శాఖ డివిఎమ్ గిరిధర్ రెడ్డి)


చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి త్వరలో విశాఖ తోపాటు కర్ణాటక, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రారంభించనున్నట్లు తిరుపతి డివిఎం గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన హార్సిలీహిల్స్ లో మీడియాతో

మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో స్తంభించిన పర్యాటక సేవలు పునర్ ప్రారంభించామని అన్నారు. కుప్పం, పలమనేరు, నగిరి లలోని యూనిట్ లు త్వరలో ప్రారంభిస్తామన్నారు. త్వరలో టీటీడీ దర్శన టికెట్లు కేటాయించ నుందని అన్నారు. పర్యాటక శాఖ సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారని అన్నారు.

లాక్ డౌన్ అనంతరం హార్సిలీహిల్స్ యూనిట్ ఆదాయం దాదాపుగా

పూర్వస్థితికి చేరు కుందని ఇందుకు కృషి చేస్తున్న మేనేజర్ నేదురుమల్లి సాల్విన్ రెడ్డి ని స్థానిక సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

అంతకు మునుపు డివిఎమ్ గిరిధర్ రెడ్డి హార్సిలీహిల్స్ లో అతిథి గృహాలు, రెస్టారెంట్ , బార్, రిసెప్షన్ సముదాయాలు ను తనిఖీ చేశారు.