- Neti Charithra
అంతర్ రాష్ట్రాల రాక పోకలు పై .. సందిగ్ధం... కొనసాగనున్న.. సరిహద్దు చెక్ పోస్టులు !

అంతర్ రాష్ట్రాల రాక పోకలు పై .. సందిగ్ధం... కొనసాగనున్న.. సరిహద్దు చెక్ పోస్టులు !
అమరావతి : నేటి చరిత్ర
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల రాక పోకలు పై నిషేధం కొనసాగుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.ఎపి కోవిడ్-19 రాష్ట్ర నోడల్ అధికారి ఎమ్‌టి కృష్ణబాబు ఈ విషయం పై స్పష్టత ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎపిలోని అన్ని జిల్లాల నుంచి తెలంగాణకు బస్సులు

తిప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే బస్సుల రాకపోకలపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదని, అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు కొనసాగతాయని, రైల్వే, ఎయిర్‌పోర్టుల వద్ద కూడా చెక్‌పోస్టు

పాయింట్లు ఉంటాయని తెలిపారు. ఎపికి వచ్చేవారందరూ స్పందన వెబ్సైట్లో రిజిస్టర్ చేయించుకోవాలని పేర్కొన్నారు. కరోనా ప్రభావ రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు పంపుతామని చెప్పారు.