• Neti Charithra

అంతర్జాతీయ స్థాయి లో మిట్స్ విద్యార్థి ప్రతిభ..!


అంతర్జాతీయ స్థాయి లో మిట్స్ విద్యార్థి ప్రతిభ..!




మదనపల్లె: నేటి చరిత్ర



మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు యంసిఏ - మొదటి సంవత్సరము చదువుతున్న కోటి వెంకట యువ తేజ్ కుమార్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సు లలో అంతర్జాతీయ స్థాయిలో 4 సబ్జెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచాడని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు.

లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్సుయెరా (Coursera) వారు ఆఫర్ చేసి డేటా సైన్స్, ఇంట్రడక్షన్ టూ డేటా సైన్స్ నందు ప్రతిభ కనబరిచినట్లు ఆయన అన్నారు.

ఈ సబ్జెక్టుల నందు ఈ విద్యార్ధి ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ వి. ఎల్. పావని, తదితరులు అభినందనలు తెలియజేశారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్