• Neti Charithra

అంతర్జాతీయ స్థాయి లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థి శరియాజ్ ఖాన్ !


అంతర్జాతీయ స్థాయి లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థి శరియాజ్ ఖాన్ !మదనపల్లె : నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ , మదనపల్లి నందు బి.టెక్ - ద్వితియ సంవత్సరము కంప్యూటర్ సైన్స్ & టెక్నాలజీ చదువుతున్న నిమ్మనపల్లి షరియాజ్ ఖాన్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో అంతర్జాతీయస్థాయిలో 9 సబ్జెక్ట్స్ మరియు 2 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచాడని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (Coursera) వారు ఆఫర్ చేసి 9 సబ్జెక్ట్స్ మరియు 2 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ

కనబరిచినట్లు ఆయన అన్నారు. ఈ విద్యార్ధి ప్రతిభ కనపరిచినందుకు గాను ప్రశంసపత్రాన్ని పొందిదని, ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ యం. శ్రీదేవి, తదితరులు అభినందనలు తెలియజేశారు