• Neti Charithra

అంతర్జాతీయ స్థాయి లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థిని పూజిత..!అంతర్జాతీయ స్థాయి లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థిని పూజిత..!మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లామదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బి.టెక్ - ప్రధమ సంవత్సరము కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ లో చదువుతున్న జి.పుజిత ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో అంతర్జాతీయస్థాయిలో 11 సబ్జెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచింది అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్

సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (Coursera) వారు ఆఫర్ చేసి 11 సబ్జెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచినట్లు ఆయన అన్నారు. ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థినికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థినికి కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్,తదితరులు అభినందనలు తెలియజేశారు.