• Neti Charithra

అంతర్జాతీయ పరీక్షల్లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థి నూర్ ఆహమద్..!


అంతర్జాతీయ పరీక్షల్లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థి నూర్ ఆహమద్..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బి.టెక్ - ద్వితీయ సంవత్సరము ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో చదువుతున్న జి.నూర్ మహ్మద్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో

అంతర్జాతీయస్థాయిలో 10 సబ్జెక్ట్స్ మరియు 1 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరి చాడని

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ

కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (Coursera) వారు ఆఫర్ చేసి 10 సబ్జెక్ట్స్ మరియు 1 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచినట్లు ఆయన అన్నారు. ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థినికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ

కనపరిచిన ఈ విద్యార్థినికి కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ డాక్టర్ ఎస్.రాజశేఖరన్, తదితరులు అభినందనలు తెలియజేశారు.