• Neti Charithra

అంతర్జాతీయ కరాటే లో అదర గొట్టిన మదనపల్లె విద్యార్థిని పావని!

#అంతర్జాతీయ కరాటే లో అదర గొట్టిన మదనపల్లె విద్యార్థిని పావని!

మదనపల్లె: నేటి చరిత్ర (నవంబర్4) ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లె బాలయోగి గురుకుల విద్యార్ధి ని పావని అంతర్జాతీయ కరాటే పోటీల లో సంచలన విజయాల ను సొంతం చేసుకొని గురుకుల విద్యాలయ ప్రతిష్టను మరింతగా పెంచింది. పంజాబ్ లోని జలందర్ నగరం లో రెండు రోజుల క్రితం అంతర్జాతీయ వోకినవా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న మదనపల్లె గురుకుల 9 వ తరగతి విద్యార్థిని జి పావని కటాస్ విభాగం లో అగ్రస్థానం సాధించింది. అలాగే షాయ్ విభాగం లోను రెండవ స్థానం సాధించింది. దింతో జాతీయ స్థాయి కరాటే.. లో ప్రతిభ చూపిన విద్యార్ధి ని పావని కి.. మదనపల్లె కు చెందిన కరాటే కోచ్ సురేష్ ను సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రవి చంద్ర, గురుకుల సొసైటీ కార్యదర్శి కల్నల్ రాములు తో పాటు స్థానిక విద్యాలయ ప్రిన్స్ పాల్ చంద్ర శేఖర్ మరియు సిబ్బంది ప్రత్యేకం గా అభినందించారు.