• Neti Charithra

అంగళ్ళు మిట్స్ విద్యార్థులకు.. అవగాహన !

#అంగళ్ళు మిట్స్ విద్యార్థులకు.. అవగాహన !

మదనపల్లె: నేటి చరిత్ర (సెప్టెంబర్11) చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి (మిట్స్) కళాశాల నందు ఎంట్రీప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ వారు అగ్రిప్రేనియర్షిప్ పై అవగాహన కార్యక్రమాన్ని ఈ.డి విద్యార్థులకు మరియు ఏం.బి.ఏ విద్యార్థులకు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి డాక్టర్. ఏం. నరేష్ రెడ్డి, బిజినెస్ మేనేజర్, రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, తిరుపతి పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడు తూ వ్యవసాయ రంగం లో ఉన్న వివిధ విభాగాల గురుంచి విద్యార్థులకు వివరించారు.వ్యవసాయ రంగం లో ముక్యంగా 20 విభాగాల నందు పరిస్కారం కానీ సమస్యలు ఉన్నాయని, విద్యార్థులు లకు వాటి గురుంచి వివరించినారు. ఈ సమస్యల పరిష్కరానికి సీడ్ ఫండింగ్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయని, దీని ద్వారా ఇంక్యూబేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ ఫండింగ్ ద్వారా సమస్యల పరిష్కరానికి కావలసిన ల్యాబ్ లను మరియు ఇండస్ట్రీ ఎక్సపర్ట్స్ తో కూడా కలవడానికి రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ ద్వారా అందజేస్తామని ఆయన అన్నారు. విద్యార్థులు ఒక్క టెక్నాలజీ లోనే నూతన అంశాలను ప్రవేశపెట్టడం కాకుండా, వ్యవసాయ రంగం లో గల సమస్యలను కూడా పరిష్కరంచాలని విద్యార్థులతో అన్నారు. విద్యార్థులకు రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ తరపున 8 వారల ఇంక్యూబేషన్ కార్యక్రమాన్ని కూడా వారి కి ఉన్న స్కీమ్స్ ద్వారా అందజేస్తామని ఆయన అన్నారు. విద్యార్థులు సాధించ గలిగితే వారే ఈ రంగం లో సొంత పరిశ్రమలు కూడా స్థాపించుటకు అనేక మార్గాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో డైరెక్టర్ ప్రసాద్, కో ఆర్డినేటర్ డాక్టర్ సోమశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.