• Neti Charithra

అంగన్ వాడీ హెల్పర్ల సమస్యలు పై సత్యవేడు లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనలు..!


అంగన్ వాడీ హెల్పర్ల సమస్యలు పై సత్యవేడు లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనలు..!



సత్యవేడు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాసత్యవేడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి హెల్పర్స్ లకు ఇవ్వాల్సిన ప్రమోషన్లపై న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని సిఐటియు జిల్లానాయకులు దాసరి జనార్ధన్

తెలిపారు!. శనివారం సత్యవేడు తాసిల్దార్ ఆఫీస్ వద్ద దీక్షకు దిగిన హెల్పర్లు కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ, సత్యవేడు ఐసిడిఎస్ సి డి పి ఓ రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు లోనై ప్రమోషన్లు కల్పించాల్సిన అంగన్వాడి హెల్పర్ లపై వారి యొక్క పనితీరు బాగాలేదని తప్పుడు నివేదికలు ను జిల్లా అధికారులు పంపించడం దారుణమని విమర్శించారు. ఈ విషయంపై న్యాయస్థానంలో దావా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏదేని

కారణం చేత అంగన్వాడి సెంటర్ లో వర్కర్ పోస్ట్ ఖాళీ అయితే అదే కేంద్రంలో పనిచేస్తున్న హెల్పర్ కు ప్రమోషన్లు కల్పించాలని జీవో ఉన్నప్పటికీ కూడా లెక్క పెట్టని అధికారులు రాజకీయ నాయకులకు తలొగ్గి వారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శించారు.


53 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon