• Neti Charithra

అంగన్ వాడి కేంద్రం లో రాసలీలలు.. చివరికి ఏం.. జరిగిందంటే!

#అంగన్ వాడి కేంద్రం లో రాసలీలలు.. చివరికి ఏం.. జరిగిందంటే!

చెన్నై: నేటి చరిత్ర (సెప్టెంబర్11) పాఠశాల మరుగుదొడ్డిలో మహిళతో రాసలీలలు చేస్తున్న ఉపాధ్యాయుడిని గ్రామస్తులు బుధవారం చితకబాది దేహశుద్ధి చేసిన సంఘటన తమిళ నాడు లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా పుదుచత్రం సమీపంలోని ఎస్‌ ఉడుంబం అనే గ్రామం ఉంది. ఇక్కడ ఎలిమింటరీ పాఠశాలకు హెడ్‌మాస్టర్‌గా జయరాజ్, ఉపాధ్యాయుడు శరవణన్‌ ఉ న్నారు. ఇక్కడికి పక్కనే ఉన్న అంగన్‌వాడి పాఠశాలలో పనిచేస్తున్న మహిళకు శరవణన్‌కు అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం. వీరు గత కొన్ని నెలలుగా పాఠశాల మరుగుదొడ్డిలో కలుసుకుని రాసలీలలు నెరపుతున్నట్టు తెలుస్తోంది. దీన్ని గమనించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉప్పందించటం తో వారిద్దరికి దేహశుద్ధి చేసారు.