- Neti Charithra
అసెంబ్లీ.. తీర్మానాలు పై కీలక నిర్ణయం తీసుకున్న శాసన మండలి చెర్మన్ మహమ్మద్ షరీఫ్!

అమరావతి : నేటి చరిత్ర (జనవరి21)
ఏపీ శాసన మండలిలో చెర్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజులుగా ఉత్కంఠత నెలకొన్న కీలక తీర్మానాలు ఫై మంగళవారం సాయంత్రం శాసన మండలి చెర్మన్ మహమ్మద్ షరీఫ్ శాసన మండలి లో అసెంబ్లీ తీర్మానాలు పై చర్చకు అనుమతించా రు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ బిల్లును, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. ఛైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా సభ్యులు పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. రూల్ 71పై చర్చకు నోటీసు ఇచ్చినా బిల్లులను పరిగణనలోకి తీసుకోవడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఛైర్మన్ స్పందిస్తూ రూల్ 71పై చర్చ ప్రారంభించాలని సూచించారు. తెదేపా సభ్యుడు రాజేంద్రప్రసాద్ చర్చను ప్రారంభించారు. రూల్ 71పై చర్చకు తెదేపాకు రెండు గంటల సమయాన్ని ఛైర్మన్ కేటాయించారు. మరోవైపు మండలిలో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటుండటంతో గ్యాలరీలు ఎమ్మెల్యేలతో నిండిపోయాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చి మండలి సమావేశాలను తిలకిస్తున్నారు.
