- Neti Charithra
అశ్లీల వీడియోలతో... నన్ను వేధిస్తున్నారు- నటి కరాటే కళ్యాణి !

అశ్లీల వీడియోలతో.. నన్ను.. వేధిస్తున్నారు- నటి కరాటే కళ్యాణి !
హైదరాబాదు: నేటి చరిత్ర (జనవరి30)
అశ్లీల వీడియోలతో... తనను కొందరు వేధిస్తున్నారని ఉదయాన్నేఫోన్ చూడాలంటేనే భయం వేస్తోంద’ని సినీ నటి కళ్యాణి అలియాస్ కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ పనులు చేస్తున్నారని, కొన్ని నంబర్లను బ్లాక్ చేసినా వేరే ఫోన్నంబర్ల ద్వారా వీడియోలు పంపుతున్నారని ఆమె వివరించింది. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా ప్రవరిస్తున్నారని, కొన్నింటిలో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నారంటూ తెలిపింది. వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను అభ్యర్థించింది.

క్రైస్తవ సంఘాల ప్రతినిధుల పేరుతో కొద్దిరోజుల నుంచి కొందరు వ్యక్తులు హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో కథనాలు, వీడియోలను అప్లోడ్ చేస్తున్నారని కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు లో పేర్కొన్నారు.