• Neti Charithra

అవినీతి.. అధికారులపై నిర్బంధ చర్యలు!

#అవినీతి.. అధికారులపై నిర్బంధ చర్యలు!

ఒడిశా: నేటి చరిత్ర (అక్టోబర్5) ఒడిశా రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్, ఒడిశా ప్రాంతీయ రవాణశాఖ అధికారి,మరో ఇద్దరు అటవీశాఖ అధికారులను నిర్బంధంగా పదవీ విరమణ చేయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా రాష్ట్ర విజిలెన్స్ విభాగం నలుగురు అధికారుల అవినీతి బాగోతంపై దర్యాప్తు జరిపి నివేదికలు సమర్పించింది. నలుగురు ప్రభుత్వ అధికారులకు సంపాదనకు మించిన ఆస్తులున్నాయని దర్యాప్తులో తేలింది. దీంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఒడిశా ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలను నిరోధించేందుకే అక్రమార్కులైన అధికారులను నిర్బంధంగా పదవీ విరమణ చేయించారని సమాచారం.