• Neti Charithra

అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి..104..108 సేవలు అందాలి- చిత్తూరు జిల్లా నోడల్ అధికారి లోక వర్ధన్..!


అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి..104..108 సేవలు అందాలి- చిత్తూరు జిల్లా

నోడల్ అధికారి లోక వర్ధన్..!


తిరుపతి: నేటి చరిత్ర


104 మరియు 108 సేవలపై సమీక్ష జిల్లా నోడల్ అధికారి డాక్టర్ లోకవర్ధన్ తిరుపతి లోని కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా నోడల్ అధికారి డాక్టర్ లోకవర్ధన్ మాట్లాడుతూ జిల్లాలో 64 104 సంచార వైద్య సేవల వాహనాలు

ఉన్నాయని ,గ్రామాల్లో వీటి ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. దీర్ఘకాలిక జబ్బులఐన బి.పి,షుగర్ వంటి జబ్బులకు నెలకు సరిపడా మందులు ఇచ్చి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై ఆరోగ్య విద్య ఇవ్వడం చేయాలని తెలిపారు. గ్రామాల్లో మొదటి షిఫ్ట్ ఐన తర్వాత ,భోజన విరామం అనంతరం 104 సిబ్బంది గృహ దర్శనాలు చేయాలని వీటిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.సిబ్బంది సమయపాలన పాటించాలని హెచ్చరించారు.స్థానిక

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి ఆశా,ఏ. ఎన్. ఎమ్ లు తప్పనిసరి గా హాజరు కావాలి.ముందు రోజు 104 సేవల వివరాలు గ్రామంలో టామ్ టామ్ వేయించాలి. వ్వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని ప్రతి ఇంటికి వెళ్ళాలి.సచివాలయంలో 104 సేవల వివరాలు డిస్ప్లే లో ఉంచాలి.క్లోరినేషన్ ప్రక్రియలు ప్రతి పాయింట్ లో జరగాలని ఆదేశించారు. రోగాలు పుట్టే ప్రదేశాలు గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు.108 వాహనాల సేవలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వచ్చేవిదంగా అలెర్ట్ గా ఉండాలని,ప్రమాద కేసులు,హై రిస్క్ గర్భవతుల కేసులు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఈకార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ భాస్కర్ రావు,అదనపు జిల్లా మేనేజర్ శ్రీహరి,పాల్గొన్నారు.