• Neti Charithra

అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో 104,108 సేవలు- సీఎం జగన్ మోహన్ రెడ్డి!


అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో 104,108 సేవలు- సీఎం జగన్ మోహన్ రెడ్డి!


విజయవాడ: నేటి చరిత్ర



ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా రికార్డు స్థాయిలో రూ.201 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన కొత్త 108, 104 వాహనాలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. మొత్తం 1068 వాహనాలను విజయవాడలోని బెంజి సర్కిల్‌ వద్ద పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కుయ్... కుయ్ శబ్ధాలతో విజయవాడ మార్మోగింది.మొత్తం వాహనాల్లో 656.. 104 వాహనాలు, 412... 108

వాహనాలు ఉన్నాయి.104 వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా మండలానికొకటి చొప్పున కేటాయించారు. గిరిజన ప్రాంతాల్లో ఫోన్‌కాల్‌ వచ్చిన 25 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల్లో 108 అంబులెన్సు ఘటనా స్థలికి చేరుకునేలా విధివిధానాలు నిర్ణయించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు.