• Neti Charithra

అలిగి..పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి తీసుకు రాలేదని.. తల్లి..తండ్రిని చంపిన తనయుడు !


అలిగి..పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి తీసుకు రాలేదని.. తల్లి..తండ్రిని చంపిన తనయుడు !



బెంగుళూరు: నేటి చరిత్ర


అలిగి.. పుట్టింటికి వెళ్లిన భార్యను పిలుచుకు రాలేదని తల్లి తండ్రులు ను హత్య చేసిన కుమారుడిని పోలీసులు కట కటాలు పాలు చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా కనకగిరి పట్టణం లో సంచలనం కలిగించింది.

హతులను కనకగిరి 9వ వార్డులో నివాసం ఉంటున్న మడివాళ గిరియప్ప (59), అక్కమ్మ (55) దంపతులుగా గుర్తించారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు... గిరియప్ప, అక్కమ్మ దంప తులకు ఓ కుమార్తె, కుమారుడు సంతానం. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. కొడుకు రమేశ్‌ (30)కు అయిదేళ్ల క్రితం వివాహమైంది. అయిదు నెలలుగా భార్య పుట్టింట్లో ఉంటుంది. ఆమెను తీసుకు వచ్చేందుకు చొరవ చూపాలంటూ రమేశ్‌ తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఈ

విషయమై సోమవారం రాత్రి ముగ్గురి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రమేశ్‌ గడ్డపారతో తల్లిదండ్రులను హతమార్చాడు. అక్కమ్మ ఘటనాస్థలంలోనే మృతి చెందగా గిరియప్ప కొప్పళ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలొదిలాడు. తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం హత్యల విషయం వెలుగుచూసింది. దీనిపై కనకగిరి ఠాణాలో కేసు నమోదైంది. ఎస్పీ సంగీత, డీఎస్పీ చంద్రశేఖర్, గంగావతి గ్రామీణ సీఐ సురేశ్‌ తళవార్, ఎస్సై ప్రశాంత్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.  

220 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon