• Neti Charithra

అలరించిన... కృష్ణాష్టమి వేడుకలు

బి కొత్తకోట:నేటి చరిత్ర(ఆగస్టు23) చిత్తూరుజిల్లా బి కొత్తకోట లో శ్రీ కృష్టాష్టమి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. స్థానిక షిర్డీసాయి బాబా ఆలయం లో జరిగిన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా షిర్డీసాయి బాబాకు చేసిన విభిన్న రూపాల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ పూజలకు హాజరైన భక్తులకు ఆలయ కమిటీ నిర్వహకులు తీర్థ ప్రసాదాలు పంపిణి చేసారు.