• Neti Charithra

అర్హత ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా... ద్వారా రూ.70 వేలు - ఎమ్మెల్యే నవాజ్ బాష!


అర్హత ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా... ద్వారా రూ.70 వేలు - ఎమ్మెల్యే నవాజ్ బాష!


మదనపల్లె: నేటి చరిత్ర


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా పథకం అందిస్తున్నారని చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాష పేర్కొన్నారు. మదనపల్లి మండలం వేంపల్లి గ్రామ సచివాలయం నందు ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు వేరుశెనగ విత్తన కాయలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.ఏ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మహా పాదయాత్ర చేసిన సందర్భంగా రైతుల కష్టాలను నష్టాలను కళ్ళారా చూసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అని తెలిపారు. 2019 ఎన్నికలముందు మ్యానిఫెస్టో లో పెట్టిన పథకాలను, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంవత్సరంలోపే అన్నిటిని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందని అన్నారు. వై.ఎస్.ఆర్. పార్టీ రైతుల పార్టీ అని,రైతుల సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నామని తెలిపారు.

రైతులకు రైతు భరోసా ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం రూ.13,500 వంతున 5 సంవత్సరాల వరకు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అని, ఆయన తనయుడిగా ఇచ్చిన మాట కోసం కరోనా మహమ్మారి వల్ల ఆర్ధిక పరిస్థితి బాగాలేకున్నాను ఉద్యోగస్తులకు, ఎం.ఎల్.ఏ లకు జీతాలు తగ్గించి ఇచ్చి, రైతులను అన్ని విధాల ఆదుకునేందుకే రైతు భరోసాను అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఎక్కడా అవినీతికి తావు లేకుండా పాలనచేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడి విజయకుమార్ మాట్లాడుతూ ఈ నెల 15న జిల్లాకు సంబంధించి 4లక్షల 56వేల మందికి రూ.5,500 చొప్పున రైతు భరో సా ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం

జరిగిందని తెలిపారు. జిల్లాలో 940 రైతు భరోసా కేంద్రాలను ఈ నెల 30 న ప్రారంబోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఏ జిల్లాలో పండించిన వేరుశనగ పంటను ఆ జిల్లా రైతులకే విత్తన కాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించిఉన్నారని, అందులో బాగంగా చిత్తూరు జిల్లాలో రైతుల నుండి 40 వేల క్వింటాళ్ల విత్తన కాయల పంపిణీకి సిద్ధం చేశామని తెలిపారు. గతంలో అయితే ఇతర రాష్ట్రాల నుండి విత్తన కాయలను తీసుకొని ప్రాసెసింగ్ చేసి రైతులకు అందజేసేవారమని, ఏ జిల్లాలో సేకరించిన కాయలు ఆ జిల్లాలోనే వేరే ప్రాంతాల రైతులకు ఇవ్వడం వళ్ళ ప్రాసెసింగ్ చార్జీలు మరియు 40 శాతం రాయితీని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఇప్పటికే చాలామంది రైతులు వేరుశెనక్కాయలు సంబంధించిన పర్మిట్ లను కూడా పొంది ఉన్నారని, ఎవరైతే ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకున్నారో వారికి వేరుశెనగ విత్తన కాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారికి సబ్సిడీ పోను మిగతా రూ.1413 పైకం చెల్లించిన రైతులు విత్తన కాయలు వారి సమీపంలోని సచివాలయాల ద్వారా పొందవచ్చునని తెలిపారు. గతంలో ఐతే మండల కేంద్రంలో ఒకటి రెండు చోట్ల పంపిణీ చేసేవారమని, అప్పుడు రైతులు మండల కేంద్రానికి వచ్చి ఇబ్బందులకు గురి అయ్యే వారని, అలా కాకుండా ఈ ప్రభుత్వం రైతుకు సంబందించి ఆయా గ్రామాలలోనే పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పర్మిట్ లను ఎక్కువగా ఒకేసారి ఇవ్వకుండా రోజువారి పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని, సామాజిక దూరాన్ని పాటించచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం రైతులకు వేరుసేనగ విత్తన కాయలతో పాటు రైతులకు ముఖ్యమంత్రి సందేశం కాపీలను అందజేసారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏ.డి శివశంకర్, ఏ.ఓ లు నాగ పద్మిని, నాగ ప్రసాద్, ఎ.పి.డి.ఓ లీలామాధవి, సింగల్ విండో అద్యక్షుడు కరుణాకర్ రెడ్డి, ఉదయ కుమార్, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.