• Neti Charithra

అర్ధ రాత్రి.. బ్యాంక్ లో దొంగలు..పడ్డారు.. చిత్తూరు జిల్లా లో కల కలం..!


అర్ధ రాత్రి.. బ్యాంక్ లో దొంగలు..పడ్డారు.. చిత్తూరు జిల్లా లో కల కలం..!
పలమనేరు: నేటి చరిత్రచిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లెలో దొంగలు రెచ్చిపోయారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకులో అర్ధరాత్రి చోరీకి విఫలయత్నం చేశారు. దుండగులు బ్యాంకు

లోపలికి ప్రవేశించి స్ట్రాంగ్ రూమ్‌ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. దీనిని పసిగట్టిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు సకాలంలో బ్యాంకు వద్దకు చేరుకోవడంతో దుండగులు

పరారయ్యారు. బ్యాంకులో సొమ్ము పోయిందా? లేదా? అని పోలీసులు, బ్యాంకు అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.