- Neti Charithra
అర్ధరాత్రి హై డ్రామా.. జేసీ ప్రభాకర్ రెడ్డి ని కడప జైలు కు తరలించి న పోలీసులు !

అర్ధరాత్రి హై డ్రామా.. జేసీ ప్రభాకర్ రెడ్డి ని కడప జైలు కు తరలించి న పోలీసులు !
అనంతపురం: నేటి చరిత్ర
అనంతపురం లో శనివారం
అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. జేసీ – ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను రాత్రి 2.30గంటలకు అనంతపురం నుంచి వైఎస్ జగన్ సొంత ఇలాకా కడపకు తరలించారు. జేసీ ట్రావెల్స్ బస్సుల గోల్ మాల్ వ్యవహారంలో అరెస్ట్ అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి – ఆయన

కుమారుడు – టీడీపీ తాడిపత్రి ఇన్ చార్జి అస్మిత్ రెడ్డిలను అర్ధరాత్రి కడపలోని కేంద్ర కారాగారానికి తరలించారు.
నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డీలను పోలీసులు వైధ్య పరీక్షల నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షల అనంతరం వారిని

అరవిందనగర్ లో ఉన్న మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వారికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డీలను అనంతపురం రెడ్డిపల్లి సబ్ జైలుకు తరలించారు. శాంతి భద్రతల దృష్ట్యా న్యాయస్తానం ఆదేశాలు మేరకు వారిని భారీ బందోబస్తు మధ్యగత అర్ధరాత్రి కడప జైలుకు తరలించారు