• Neti Charithra

అర్ధరాత్రి కర్ణాటక మద్యం అక్రమ రవాణా.. ఛేజింగ్ చేసిన మదనపల్లె పోలీసులు.. భారీగా పట్టు పడ్డ మద్యం!


అర్ధరాత్రి కర్ణాటక మద్యం అక్రమ రవాణా.. ఛేజింగ్ చేసిన మదనపల్లె పోలీసులు.. భారీగా పట్టు పడ్డ మద్యం!

మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లె తాలుకా పోలీసులు కర్ణాటక మద్యం తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. తాలుకా ఎస్ ఐ దిలీప్ కుమార్ కథనం మేరకు.. మదనపల్లె సమీపం బొమ్మన చెరువు వద్ద అర్ధ రాత్రి ఎస్ ఐ దిలీప్ కుమార్ సిబ్బంది తో కలిసి తనిఖీలు చేస్తుండగా అటుగా వస్తున్న

కారు వేగంగా వెనక్కు వెళుతుండగా గమనించిన పోలీసులు ఛేజింగ్ చేసి కారును అదుపులోకి తీసుకోగా అందులో ఉన్న నిందితులు పరారు అయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన కారు లో 17 కేసుల కర్ణాటక మద్యం పట్టు పడింది. కేసు నమోదు చేసుకున్న తాలుకా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.