• Neti Charithra

అరుదైన కేంద్ర పురస్కారాన్ని అందుకున్న చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా!

#అరుదైన కేంద్ర పురస్కారాన్ని అందుకున్న చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా!

చిత్తూరు: నేటి చరిత్ర (అక్టోబర్ 23) చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ భరత్ గుప్తా అరుదైన దిన్ దయాల్ స్వశక్తి కరణ అవార్డును కేంద్ర ప్రభుత్వం చే అందుకున్నారు. 2017-18 సంవత్సరము నకు గాను చిత్తూరు జిల్లాలో జిల్లా పరిషత్ నిధులతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతికి గాను దీన్ దయాళ్ స్వశక్తీకరణ పురస్కారంను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి డా.నారాయణ భరత్ గుప్తా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖామాత్యులు నరేంద్రసింగ్ తోమార్ నుండి బుధవారం ఢిల్లీ లోని నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ కాంప్లెక్స్ లోని సి.సుబ్రమణ్యం హాల్లో అందుకున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ప్రధానం చేశారు. జిల్లా నుండి వెదురుకుప్పం మండలంలో 2017-18 సంవత్సరానికిగాను సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతికి సంబంధించి వెదురుకుప్పం ఎంపిడిఓ (ప్రస్తుత జెడ్పీ ఉప ముఖ్యకార్యనిర్వహణ అధికారి) రాజశేఖర రెడ్డికి, రాష్ట్రంలోనే కరకంబాడి పంచాయతీలో ఆదర్శంగా బృందావనాన్ని తీర్చిదిద్దడంతో పాటు గ్రామ అభివృద్ధికి వినూత్న పద్ధతిలో ప్రణాళికలను అమలు చేయడంతో రేణిగుంట మండలం, కరకంబాడి పంచాయతీ కార్యదర్శి మోతీలకు పురస్కారాలను పొందారు.