• Neti Charithra

అరుణ్ జెట్లీ మృతి పార్టీకి తీరని లోటు- కన్నా

#అరుణ్ జెట్లీ మృతి పార్టీకి తీరని లోటు- కన్నా

రేణిగుంట:నేటి చరిత్ర (ఆగస్టు24) బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు విద్యార్థి దశ నుండి నిబద్ధతతో అఖండత దీక్షతో భారతీయ జనతా పార్టీకి భారత దేశం అభివృద్ధికి కృషి చేసినటువంటి మహా నాయకుడు పార్టీలో ఏ బాధ్యతలు అప్పజెప్పిన ఆ బాధ్యతలకు వన్నె తెచ్చే విధంగా పని చేసినటువంటి సౌమ్యుడు మేధావి అరుణ్ జైట్లీ మరణం భారతీయ జనతా పార్టీ కే కాదు భారత దేశ అభివృద్ధికి కూడా తీరని లోటన్నారు.అటువంటి మహా నాయకుడు మన మధ్య లేకపోవడం తీవ్ర లోటుగా భావిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో కోలాఆనంద్.బానుప్రకాశ్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు