• Neti Charithra

అరుణ్ జెట్లీ అంతిమ యాత్రకు భారీగా తరలి వచ్చిన నేతలు

#అరుణ్ జెట్లీ అంతిమ యాత్రకు భారీగా తరలి వచ్చిన నేతలు

న్యూఢిల్లీ: నేటి చరిత్ర (ఆగస్టు25) బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర కు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎం లు, మాజీ సీఎం లు హాజరు అయ్యారు. ఆదివారం స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయాన్ని తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో జైట్లీ పార్థీవదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అరుణ్‌ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్‌, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఈ నెల 9వ తేదీ నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జైట్లీ.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మధ్యాహ్నం 12గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్య, అరుదైన కేన్సర్‌తో జైట్లీ బాధపడుతున్నారు.