• Neti Charithra

అరటి పండ్ల బిల్లుకు... 4వేలు లంచం.. తీసుకుంటూ.. ఏసీబీ కి చిక్కిన గురుకులం ... అధికారి !


అరటి పండ్ల బిల్లుకు 4వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబి కి చిక్కిన గురుకులం అధికారి !


విశాఖ: నేటి చరిత్ర


విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి గురుకుల పాఠశాల ఇన్‌ఛార్జి వార్డెన్‌ పాడి తాతారావు ఎసిబి అధికారులకు మంగళవారం చిక్కారు. ఎసిబి డిఎస్‌పి కె.రంగరాజు కథనం ప్రకారం... జిల్లాలోని ఆనందపురం మండలం, గుడిలోవ గ్రామానికి చెందిన కోరాడ ఆదినారాయణ ఐదేళ్లుగా తెనుగుపూడి గురుకుల పాఠశాలకు అరటి పండ్లు సరఫరా చేస్తున్నారు. వీటికి సంబంధించి మూడు నెలలుగా సుమారు లక్ష రూపాయలకు పైగా బిల్లు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం చెల్లించాలని ఆదినారాయణ అడగ్గా రూ.4 వేలు ఇస్తే బిల్లులు పెడతానని తాతారావు చెప్పాడు. దీంతో, ఆదినారాయణ సోమవారం ఎసిబి కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఎసిబి అధికారుల పథకం ప్రకారం ఆదినారాయణ మంగళవారం పాఠశాల భోజనశాలలో తాతారావుకు రూ.4వేలు ఇస్తుండగా అప్పటికే మాటువేసిన ఎసిబి అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, బుధవారం కోర్టులో తాతారావును హాజరు పరుస్తామని ఎసిబి అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సిఐలు ఎస్‌కె గఫూర్‌, ఎస్‌ రమేష్‌, పి.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.