• Neti Charithra

అయ్యో.. పాపం.. SI సుమన్... మూడు మాసాలకే... 30 ఫిర్యాదులు 

#అయ్యో.. పాపం.. సుమన్... మూడు మాసాలకే... 30 ఫిర్యాదులు !

బి కొత్తకోట: నేటి చరిత్ర (అక్టోబర్12) చిత్తూరు జిల్లా బి కొత్తకోట ఎస్ ఐ సుమన్ పై జిల్లా ఎస్పీ సింథిల్ కుమార్ విఆర్ కు పంపుతూ వేటు వేయడం స్థానికంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. బి కొత్తకోట ఎస్ ఐ గా ఆయన బాధ్యతలు చేపట్టి న మూడు మాసాలకే పలు వివాదాలు ఆయనకు చుట్టుముట్టడం పడమటి ప్రాంతాల్లో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బి కొత్తకోట మండలం బీరంగి గ్రామం లో ఇటీవల ఓ మహిళ మరో వ్యక్తీ పై ఇచ్చిన ఫిర్యాదు పై ఎస్ ఐ సుమన్ స్పందించలేదని ఈ విషయం లో నగదు భారీగా చేతులు మారాయని నేరుగా జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు అందింది.

వీటికి తోడు .. ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు బి కొత్తకోట మండలం బీరంగి సమీపం లో భారీగా జూదం జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఇటీవల ఓసారి ఇదే జూద కేంద్రం ఫై దాడి చేసిన సందర్భం గా రూ.1.60 లక్షలు పట్టు పడితే కేవలం రూ.10 ,300 లు మాత్రమే కేసులో చూపి పలువురు నిందితులను వదిలి వేసినట్లు..(వదిలి వేసిన నిందితుల పేర్లతో పాటు) జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీటికి తోడు ఇటీవల అనధికార టపాసుల నిల్వల పై మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్ బి కొత్తకోట లో ఆకస్మిక దాడులు చేసిన సందర్భంగా స్వాధీనం చేసుకున్న టపాసులు కు సంబంధించి కేసు లేకుండా చేసేందుకు టపాసుల యజమానులకు సొంత లాభం కోసం.. ఎస్ ఐ సుమన్ చిట్కాలు అందించారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు స్పందన కార్యక్రమం లో వచ్చి న భార్యా, భర్తల గొడవల సర్దు బాటు కేసులలో ను వారినుండి.. పోలీసుల హోటల్ బిల్లులు పేరుతొ వేలాది రూపాయలు నగదు వసూలు చేశారని, హార్సిలీహిల్స్ కు వెళ్ళే పర్యాటకులకు నిబంధనలు పేరుతొ రికార్డులు సరిగా లేని వాహనాలు , డ్రైవింగ్ లైసెన్సులు పేరు తో వసూలు అవుతున్న అపరాధం నగదుకు చాలా మొత్తాలకు రసీదు లు ఇవ్వకుండా స్వాహాలకు పాల్పడుతున్నారని.. వారం క్రితం సైతం హార్సిలీహిల్స్ నుంచి బెంగుళూరు కు వెళుతున్న ఓ కుటుంబానికి చెందిన కారుబి కొత్తకోట దిగువ బస్టాండు లో సాయంత్రం 4 గంటల సమయం లో ఒన్ వే లో వెళ్లారని పట్టణం దాటి వెళ్ళిన కారును ఎస్ ఐ సుమన్ పోలీస్ సిబ్బంది చేత ఛేజింగ్ చేయించి రూ.1500 ఫై న్ డిమాండ్ చేసి రసీదు ఇవ్వక పోవడంతో కారులో ప్రయాణిస్తున్న మహిళ జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఇంకో వైపు ప్రతి రోజు పోలీస్ స్టేషన్ ఎదుటే.. నిబంధనలకు వ్యతిరేకంగా గ్రానెట్ రాళ్ల అక్రమ రవాణా జరుగుతున్న విషయాల్ని ఎస్ ఐ సుమన్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించు కోలేదని పలువురు సాక్షాధారాలతో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇలాంటి సమస్యలు కారణంగా బి కొత్తకోట ఎస్ ఐ సుమన్ పై కొందరు సాక్షాధారాలతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు.. మదనపల్లె డిఎస్పి రవి మనోహర చారి మరియు సీఐ అశోక్ కుమార్ లు ఎస్ ఐ సుమన్ ఫై విచారణ చేసి జిల్లా అధికారులకు నివేదించినట్లు సమాచారం. కాగ బి కొత్తకోట ఎస్ ఐ పై ఇన్ని ఫిర్యాదుల వెనుక ఎవరి హస్తం ఉందనే విషయం పై పోలీసుల తో పాటు స్థానికుల్లో రక రకాల ప్రచారాలు జరుగుతుండటం విశేషం.