• Neti Charithra

అయోధ్య తీర్పు పై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ !

#అయోధ్య తీర్పు పై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ !

అమరావతి: నేటి చరిత్ర (నవంబర్9) అయోధ్య‌పై సుప్రీం కోర్టు శ‌నివారం ఇచ్చిన తీర్పు ఒక‌రి విజ‌యం, మ‌రొక‌రి ప‌రాజ‌యంగా చూడ‌కూడ‌ద‌ని ఇది భార‌తీయుల విజ‌య‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ఈమేర‌కు ఇవాళ జ‌న‌సేనాని ప‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సుప్రీం తీర్పును ప్ర‌జ‌లంతా గౌర‌వించిన తీరే ఇందుకు నిద‌ర్శ‌నమ‌న్నారు. శ‌తాబ్దాల నుంచి అప‌రిష్కృతంగా ఉన్న వివాదానికి ఒక ముగింపు. దేశ‌మంటే మ‌ట్టి కాదోయ్‌..దేశ‌మంటే మ‌నుషులోయ్ అన్న గుర‌జాడ‌వారి మాట‌ల‌ను మ‌నం ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవాల‌ని పేర్కొన్నారు.