• Neti Charithra

అమెరికా లో మళ్ళీ కాల్పులు.. భయంతో పరుగులు పెట్టిన ప్రజలు

#అమెరికా లో మళ్ళీ కాల్పులు.. భయంతో పరుగులు పెట్టిన ప్రజలు

అమెరికా: నేటి చరిత్ర (సెప్టెంబర్2) అమెరికాలో మళ్లీ కాల్పుల మోత కల కలం రేపింది. టెక్సాస్ లోని ఒడెస్సా వద్ద దుండగుడి కాల్పుల్లో 8 మంది మరణించిన సంఘటన జరిగిన గంటల వ్యవథిలోనే వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పుల మోత మోగింది. ఇక్కడ జరిగిన కాల్పులలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. కాగా కాల్పులకు తెగబడిన వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.