• Neti Charithra

అమెరికా లో భారీ గా కాల్పులు.. ఆరుగురు మృతి!!

#అమెరికా లో భారీ గా కాల్పులు.. ఆరుగురు మృతి!

న్యూజెర్సీ: నేటి చరిత్ర (డిసెంబర్12) అమెరికాలో తుపాకీ తూటా లు మరో సారి హోరె త్తించాయి. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలో పోలీసులకు దుండగులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు అనుమానిత నిందితులు సహా ఓ పోలీసు ఉన్నతాధికారి ఉన్నారు. మరో ఇద్దరు పోలీసు అధికారులు, ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని నిత్యావసర సరకుల దుకాణంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఓ ట్రక్కులో ఘటనా స్థలికి వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించడంతో అనేక మంది దుకాణంలో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా.. ముష్కరులు వారిపైకి కాల్పులు ప్రారంభించారన్నారు. దీంతో గంటలపాటు భీకర ఎదురుకాల్పులు జరిగాయన్నారు. ఈ క్రమంలో వందల రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.