• Neti Charithra

అమెరికా లో భీకర కాల్పులు.. పోలీసులతో సహా ఐదుగురు మృతి..

#అమెరికా లో భీకర కాల్పులు.. పోలీసులతో సహా ఐదుగురు మృతి

అమెరికా: నేటి చరిత్ర (సెప్టెంబర్1) అమెరికా మరోసారి గన్ కల్చర్ పంజా విసిరింది. ఆదివారం జరిగిన కాల్పుల లో పలువురు పోలీసులతో పాటు ఐదుగురు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. టెక్సాస్ లోని ఒడెస్సా ప్రాంతంలో ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. టెక్సాస్ లో ఇలా కాల్పుల సంఘటన నెల రోజులలో ఇది రెండో సారి. గాయపడిన వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక దుండగుడు మరణించాడు. రెండో వ్యక్తి గురించిన సమాచారం తెలియరాలేదు. ఒక వాహనంలో వచ్చిన ఇద్దరు దుండగులు ఒక పోస్టల్ సర్వీస్ వ్యాన్ ను అపహరించి అదే వాహనంలో ఒడెస్సా ప్రాంతానికి చేరుకుని కాల్పులకు తెగబడ్డారు. ముందుగా పోలీసులపైకి ఆ తరువాత సామాన్య జనంపైకి వారు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

17 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon