• Neti Charithra

అమెరికా లోను " సేవ్ అమరావతి.. సేవ్ రాజధాని" నినాదాలు !

అమెరికా లో.. ను "సేవ్ అమరావతి.. సేవ్ రాజధాని" నినాదాలు!

అమెరికా: నేటి చరిత్ర (జనవరి12)

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఎన్‌ఆర్‌ఐలు నిరసన చేపట్టారు. ‘సేవ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

బాల్బిమోర్‌, చార్లట్‌, ర్యాలీ, మిన్ని యాపోలిస్‌, కొలంబస్‌, డల్లాస్‌, అట్లాంటా, సెయింట్‌, లూయిస్‌, బోస్టన్‌, కాలిఫోర్నియా, హ్యూస్టన్‌, ఒమాహ, కాన్వాస్‌ సిటీ, పోర్ట్‌ ల్యాండ్‌ తదితర ప్రాంతాల్లో నిరసనలు, సమావేశాలు నిర్వహించారు.