• Neti Charithra

అమెరికా నైట్ క్లబ్ లో... మరో మారు కాల్పులు.. ఇద్దరు మృతి!.

#అమెరికా నైట్ క్లబ్ లో... మరో మారు కాల్పులు.. ఇద్దరు మృతి!

అమెరికా: నేటి చరిత్ర (సెప్టెంబర్22) అగ్రరాజ్యమైన అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల కలకలం రేగింది. దక్షిణ కరోలినాలో ఓ నైట్‌ క్లబ్‌లో దుండగులు కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.