- Neti Charithra
అమ్మాయిలను ఎరగా.. వేసి.. 3 వేల మందిని.. మోసం చేసి..రూ.60 లక్షలు కాజేసిన ముఠా..!
అమ్మాయిలను ఎరగా.. వేసి.. 3 వేల మందిని.. మోసం చేసి..రూ.60 లక్షలు కాజేసిన ముఠా..!
విజయనగరం: నేటి చరిత్ర
ఇంటర్ నెట్ పరిజ్ఞానాన్ని వినియోగించు కుంటు అమ్మాయిలను లైన్ లో ఉంచి లక్షలు కాజేస్తున్న ముఠా ను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.ఇంటర్ నెట్ లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి, వారితో
మాట్లాడించి సుమారు 3 వేల మంది నుంచి రూ.60లక్షలు పైగా లాగేసిన ఇద్దరు హైటెక్ మోసగాళ్లను విజయనగరం రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను సీఐ సీహెచ్.శ్రీనివాస రావు ఆదివారం మీడియా కు వివరించారు.
విజయనగరం పట్టణానికి చెందిన టి.అశ్వనీరాజు పదో తరగతి వరకు చదువుకున్నాడు. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అంతర్జాలంపై బాగా పట్టు సంపాదించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించే సమయంలో పట్టణానికి చెందిన సింధు భైరవి అనే వివాహితను తన
కింద ఉద్యోగిగా చేర్చుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒడుదొడుకులతో సాగడం, చెడు వ్యసనాలకు బానిసవ్వడంతో సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
చివరకు పోలీసులకు పట్టుపడి కట కటాల పాలయ్యాడు.