• Neti Charithra

అమెజాన్‌పై అవినీతి మరక!



  • కంపెనీ భారత లీగల్‌ ప్రతినిధుల్లో కొందరు అధికారులకు లంచాలిచ్చారన్న ఆరోపణలు

  • అధికారికంగా ధ్రువీకరించని ఈ-కామర్స్‌ దిగ్గజం

  • అవినీతిని ఏమాత్రం సహించమని వ్యాఖ్యానం


న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. భారత్‌లోని కంపెనీ లీగల్‌ ప్రతినిధుల్లో కొందరు ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చారన్న ఆరోపణలపై అమెజాన్‌ దర్యాప్తు ప్రారంభించిందని ‘ది మార్నింగ్‌ కాంటెక్స్ట్‌’ కథనం వెల్లడించింది. ఈ విషయంలో సీనియర్‌ కార్పొరేట్‌ కౌన్సిల్‌ను కంపెనీ సెలవుపై పంపినట్లు రిపోర్టు పేర్కొంది. అయితే, అమెజాన్‌ మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. కాకపోతే, కంపెనీ అవినీతిని ఏమాత్రం సహించదని అమెజాన్‌ ప్రతినిధి అన్నారు. అనైతిక వ్యవహారాలపై కంపెనీ సమగ్రంగా దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. అంతేతప్ప, ఫలానా ఆరోపణలు లేదా దర్యాప్తునకు సంబంధించి వ్యాఖ్యానించలేమన్నారు.

భారత్‌లో అమెజాన్‌ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటోంది. మార్కెట్‌ పోటీ నిబంధనల ఉల్లంఘన, దోపిడీ ధరల విధానంతోపాటు తన ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేకించి కొందరు వర్తకులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తోందన్న ఆరోపణలపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీకి చెందిన భారత ప్రతినిధులు వ్యాపార లబ్ధి కోసం అవినీతికి పాల్పడ్డారన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘సీబీఐ’తో దర్యాప్తు జరిపించాలి: సీఏఐటీ

ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన వ్యవహారమైనందున ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) డిమాండ్‌ చేసింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారుల పేర్లను బహిర్గతం చేయాలని, వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అసోసియేషన్‌ కోరింది.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్