• Neti Charithra

అమర వీరుడు సంతోష్ కుమార్ కుటుంబానికి భారీ నజరానా అంద జేసినసీఎం కేసీఆర్!







సూర్య పేట: నేటి చరిత్ర



గాల్వన్‌ లోయలో వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. నేరుగా

సూర్య పేట లోనిఆయన ఇంటికి వెళ్లిన సిఎం కల్నల్‌ సంతోష్‌బాబు చిత్రపటం వద్ద నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్‌ సూర్యాపేట వెళ్లారు. చైనా సైనికులో దాడిలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌ బాబు చిత్రాపటానికి పుష్ప నివాళి అర్పించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్, కల్నల్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ వీరయోధుడి కుమారుడు, కుమార్తెను కూడా పలుకరించారు. సంతోష్‌ భార్య సంతోషి, తల్లితండ్రులతోనూ సీఎం కేసీఆర్‌ కాసేపు ముచ్చటించారు. కల్నల్‌ సంతోష్‌ భార్య సంతోషితో మాట్లాడిన కేసీఆర్‌.. ఆమెకు

గ్రూప్‌ వన్‌ జాబ్‌ అపాయింట్‌ ఆఫర్‌ను అందజేశారు. అంతేకాకుండా కుటుంబానికి అయిదు కోట్ల రూపాయల చెక్కూ అందజేశారు. షేక్ పేటలో 650 గజాల ఇంటి స్థలాల పత్రాలను కూడా సీఎం కేసీఆర్‌,  కల్నల్‌ సంతోష్‌ కుటుంబానికి అందజేశారు.