• Neti Charithra

అమర వీరుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.30 లక్షలు చెక్కు అందజేత..!


అమర వీరుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.30 లక్షలు చెక్కు అందజేత..!



ఐరాల: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా స్టేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాధాకృష్ణ తీవ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 30 లక్షల రూపాయల చెక్ ను ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ రాధాకృష్ణ మాట్లాడుతూ పాకిస్తాన్


ముష్కరులతో జరిగిన పోరాటంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణించడం దురదృష్టకరమని, ప్రవీణ్ కుమార్ రెడ్డి తమ బ్యాంక్ లో డిఫెన్స్ అకౌంట్ కలిగిఉండడం వల్ల ఆయన మరణానంతరం 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్ డబ్బులు




వచ్చాయన్నారు... ఈడబ్బులను ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా వాడుకోవాలని,భవిష్యత్తులో ప్రవీణ్ కుమార్ కుటుంబానికి స్టేట్ బ్యాంక్ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ రాధాకృష్ణ తో పాటు పొలకల స్టేట్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున, జలే బాలాజీ తదితరులు పాల్గొన్నారు.




319 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon