• Neti Charithra

అమరావతి లో మూడు రాజధానులు నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు..ఉద్రిక్తత!


అమరావతి లో మూడు రాజధానులు నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు..ఉద్రిక్తత!


అమరావతి: నేటి చరిత్ర



ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు గవర్నర్‌ ఆమోదం పొంది చట్టరూపం దాల్చడంతో రాజధానుల తరలింపు వడివడిగా అడుగులు వేస్తోంది ఏపీ


ప్రభుత్వం. ఆ దిశగా వేగంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ ఆగస్టు నెలలోనే తొలి విడతగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయాన్ని తరలించాలని నిర్ణయించింది. విశాఖపట్నంలో సీఎం కార్యనిర్వహక కార్యాలయాన్ని తాత్కాలికంగా ఒకచోట ఏర్పాటుచేయాలని అధికారులు భావిస్తున్నారు. అటు, అదే సమయంలో నూతన భవన నిర్మాణానికి

భూమిపూజ చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కూ డా విశాఖపట్నంలోనే నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. ఇక, ఆ తర్వాత కరోనా పరిస్థితులు చక్కబడ్డాక

ఆయా శాఖ ప్రధాన కార్యాలయాలను విశాఖకు తరలిస్తారని అంటున్నారు. అనంతరం ఏపీ రాష్ట్ర సచివాలయాన్ని కూడా తరలించి పూర్తిస్థాయి పరిపాలనను విశాఖ నుంచి కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు.


అమరావతి లో ఉద్రిక్తత..



ఏపీ లో మూడు రాజధానులు కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో 29 గ్రామాల్లో అర్ధరాత్రి ఆందోళనలు ఊపందుకున్నాయి. రైతులు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పలు చోట్ల ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారాయి.



189 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon